త్రిపుర సర్కార్‌లో ముసలం!

అగర్తలా : త్రిపురలోని బిజెపి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం గ‌డ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ముఖ్యమంత్రి విప్లవ్‌ కుమార్‌ దేవ్‌ వైఖరిని నిరసిస్తూ 11 మంది ఎమ్మెల్యేలు బిజెపి జాతీయాధ్యక్షుడు జెపి నడ్డా..హోం మంత్రి అమిత్‌షాను క‌లిసి ఫిర్యాదు చేయ‌నున్నారు. ఢిల్లీకి వెళ్లిన వారిలో సుశాంత చౌదరి, పరిమల్‌ దేవ్‌ బర్మా, డిసి రాంఖ్వాల్‌, అశిష్‌దాస్‌, అతుల్‌ దేవ్‌ వర్మ, రామ్‌ప్రసాద్‌లాల్‌ తదితరులున్నట్లు సమాచారం. వీరే గాక మరో 25 మంది ఎమ్మెల్యేలు సైతం విప్లవ్‌ వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్నారని ఫిర్యాదు చేశారు. విప్లవ్‌ ఎవ్వరినీ లెక్క చేయడం లేదని, సహచర మంత్రుల మాట పట్టించుకోవడం లేదని..ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాటి నుండి ఇదే తీరుతో వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు. తమకు కేవలం ముఖ్యమంత్రిపైనే కోపమని …ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ 11 మంది ఎమ్మెల్యేల వెనక కొంత మంది మంత్రులు కూడా ఉన్నట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.