త్వరలో ఉద్యోగ సంఘాల నేతలకు పీఆర్సీ ప్రతి?

హైదరాబాద్: ప్రభుత్వానికి అందిన పీఆర్సీ కమిటీ నివేదికను సోమ లేదా మంగళవారాల్లో ఉద్యోగ సంఘాల నేతలకు అందించే అవకాశం ఉన్నది. ఆ తర్వాత దీనిపై సంఘాల నేతలతో ప్రభుత్వం చర్చించనున్నది. మంచి ఫిట్మెంట్ ఇస్తారనే ఆశాభావంతో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు ఉన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే సీఎస్ సోమేశ్‌కుమార్‌తో ఉద్యోగ సంఘాల నేతలు పలుమార్లు చర్చించారు. ప్రగతిభవన్‌లో సమావేశమైన సందర్భంగా ఉద్యోగులకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే అధికారులు ముందుగా పీఆర్సీపై దృష్టిసారించారు. ఈ నెలాఖరులోగా ఈ సమస్యను పరిష్కరించే అవకాశం ఉన్నది.