దారుణం : పూజారులని చెర్నాకోలుతో కొట్టిన నేత!

బండిఆత్మ‌కూరు: కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం ఓంకారం క్షేత్రం లో దారుణ ఘటన జరిగింది. అర్చ‌కుల‌పై ఓ ఆల‌య క‌మిటీ చైర్మ‌న్ నిర్ధాక్షిణ్యంగా దాడికి పాల్ప‌డ్డారు. బండి ఆత్మ‌కూరు మండ‌లంలోని ఓంకారం పుణ్య‌క్షేత్రంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. కార్తీక మాసం సందర్భంగా నిన్న అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసినట్టు సమాచారం. అయితే నిన్న సాయంత్రం నుంచి భక్తులకు ఉచిత దర్శనానికి అవకాశం కల్పించాలని ఆలయ పూజారులు క్లర్క్ ‌నాగరాజుని కోరారు. అయితే అందుకు తనకు ఆదేశాలు లేవని ఆయన పూజారుల దృష్టికి తీసుకెళ్ళారు. ఈ విషయం క్లర్క్ ‌కు పూజారులకు మద్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆలయంలో జరిగిన విషయం తెలుసుకున్న చైర్మన్ ప్రతాప్ రెడ్డి అతని సోదరుడితో పాటు మరికొంత మందిని తీసుకుని గుడికి వచ్చారు. మీ ప‌ని మీరు చూసుకోవాలంటూ అర్చ‌కుల‌ను అస‌భ్యంగా దూషించారు. అనంత‌రం చ‌ర్నాకోలాతో కొట్టిన‌ట్లు అర్చకుడు సుధాక‌ర‌య్య తెలిపారు. దాడిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్లు చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.