దుబ్బాకలో బీజేపీకి సర్‌ప్రైజ్ విక్టరీ!: రామ్ మాధవ్ ట్వీట్
ఐదో రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం

తెలంగాణలోని దుబ్బాక బై పోల్‌ను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.. అయితే.. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు లీడ్‌లో ఉన్నారు… తొలి నాలుగు రౌండ్లలోనూ బీజేపీ హవా కొనసాగుతోంది.. ఇదే సమయంలో.. దుబ్బాక ఉపఎన్నిక ఫలితంపై స్పందించారు బీజేపీ నేత రామ్ మాధవ్.. ఇది బీజేపీకి ఒక సర్‌ప్రైజ్ విక్టరీ కాబోతోందంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఆసక్తికర పోరు కొనసాగుతోంది.. కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం వెనుకబడ్డారు.. ఆ పార్టీ గట్టి ప్రచారం చేసినా.. పోటీ మాత్రం టీఆర్ఎస్, బీజేపీ మధ్యే అన్నట్టుగా సాగుతోంది.
An interesting fight in Telangana between BJP n TRS in Dubbaka Assembly by poll. BJP is currently leading. This could be a surprise victory for BJP
— Ram Madhav (@rammadhavbjp) November 10, 2020
వరుసగా ఐదో రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యంలో కొనసాగింది. ఐదో రౌండ్లు ముగిసే సరికి బీజేపీ 3,020 ఓట్ల లీడ్ సాధించింది. ఇప్పటివరకు బీజేపీ 16,507.. టీఆర్‌ఎస్ 10,497.. కాంగ్రెస్ 2,724 ఓట్లు సాధించాయి.
దుబ్బాక నాలుగో రౌండ్ కౌంటింగ్ ముగిసే సరికి బిజెపికి 13055 ఓట్లతోనూ.. టిఆర్ఎస్ 10371 ఓట్లతో ఉన్నాయి.
4 రౌండ్లు ముగిసేసరికి బీజేపీ 2,684ఓట్ల ఆధిక్యం సాధించింది. ఇంకా 19 రౌండ్ల ఫలితాలు తేలాల్సి ఉంది.
నాలుగో రౌండ్‌లోనూ బీజేపీ హవా కొనసాగుతోంది. బీజేపీ నాలుగో రౌండ్‌లో 1,425 ఓట్లు ఆధిక్యత సాధించగా.. మొత్తంగా రఘునందన్‌రావు 2,684 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నాలుగో రౌండ్ ముగిసేసరికి బీజేపీ 13,055, టీఆర్‌ఎస్ 10,371 కాంగ్రెస్ 2,158 ఓట్లు సాధించాయి.