దుబ్బాక.. ఫలితంపై హైటెన్షన్..!
కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
దుబ్బాక: కౌంటింగ్ దగ్గర పడుతున్న కొద్దీ దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ప్రజా తీర్పు ఎలా ఉండబోతోందని ఉత్కంఠ నెలకొంది. టీవీల ముందుకూర్చున్న నేతలు, ప్రజలు ఎన్నికల కౌంటింగ్ బ్రేకింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లును అధికారులు పూర్తిచేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి చెన్నయ్య, జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి, సీపీ జోయల్ డేవిస్‌లు కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు.
దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్ రేపు (మంగళవారం, నవంబర్-10) జరగనుంది. సిద్దిపేట ఇందూరు ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 14 టేబుల్స్, 23 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. 1453 పోస్టల్ బ్యాలెట్, 51 సర్వీస్ ఓట్లు ఉన్నాయి. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, సర్వీస్ ఓట్లు లెక్కిస్తారు. కౌంటింగ్ విధుల్లో 200 మంది సిబ్బంది పాల్గొనున్నారు. ఉప ఎన్నిక బరిలో 23 మంది అభ్యర్థులు పోటీ చేసిన విషయం విదితమే. దుబ్బాకలో మొత్తం ఓట్లు 198756 కాగా.. పోలైన ఓట్లు164192. అంటే.. 82.61 పోలింగ్ శాతం జరిగిందన్న మాట. దుబ్బాకలో మొత్తం 315 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ జరిగింది.
ప్రచారంలో డబ్బులాట జరిగిన నేపథ్యంలో… కౌంటింగ్ సమయంలో ఎలాంటి గొడవలు జరగకుండా భద్రతను పెంచారు పోలీసులు. సిద్ధిపేట శివారులోని ఇందూరు ఇంజనీరింగ్ కాలేజీలో మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ జరుగుతుంది. మొదట బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. 1,453 బ్యాలెట్ ఓట్లు వచ్చాయి. ఎనిమిదిన్నర తర్వాత ఈవీఎంలను తెరుస్తారు. 14 టేబుళ్లపై 23 రౌండ్లలో కౌంటింగ్ నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్‌లో 350 సిబ్బంది పాల్గొంటున్నారు. కాగా, 500 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాట్లు చేసినట్లు పోలీసు కమిషనర్ జోయల్ తెలిపారు.