దేశంలో కొత్తగా 13,083 కరోనా కేసులు

న్యూఢిల్లీ: భార‌త్‌లో గడిచిన 24 గంటల్లో 13,083 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. క‌రోనా వైరస్‌ ప్రభావంతో మరో 137 మంది మృతి చెందారు. ఈ మేర‌కు శ‌నివారం ఉద‌యం కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,07,33,131కు పెరిగింది. తాజాగా 14,808 మంది వైరస్‌ బారి నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు 1,04,09,160 మంది డిశ్చార్జి అయినట్లు పేర్కొంది. అలాగే దేశంలో మొత్తం మృతుల సంఖ్య 1,54,147కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసులు 1,69,824 ఉన్నాయని పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.