దేశంలో కొత్తగా 18,855 కరోనా కేసులు

న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24 గంటల్లో 18,855 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు శుక్ర‌వారం ఉద‌యం కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. కొత్త కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,07,20,048కు చేరింది. తాజాగా మరో 163 మంది మృత్యువాతపడ్డారు. దీంతో దేశంలో మొత్తం మృతుల సంఖ్య 1,54,010కు చేరింది. తాజాగా 20,746 మంది క‌రోనా బారి నుండి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 1,03,94,352 మంది కోలుకున్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 1,71,686 యాక్టివ్‌ కేసులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.