దేశంలో కొత్తగా 75,829 పాజిటివ్ కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకి పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 75,829 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, వైరస్ బారినపడి 940 మంది మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కాగా ఈ రోజు నమోదైన కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 65,49,374కు చేరగా.. మృతుల సంఖ్య 1,01, 782కి చేరింది. కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకు 55,09,967 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 9,37,625 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.