దేశంలో 91శాతానికి పెరిగిన రికవరీలు
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ మళ్లీ విజృంభిస్తుండటం ఆందోళనగా మారగా భారత్‌లో మాత్రం క్రీయాశీల కేసులు తగ్గుముఖం పట్టడం ఊరట కలిగిస్తోంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య రోజురోజుకి తగ్గుతూ 6 లక్షల దిగువకు చేరింది. ప్రస్తుతం 5,82,649 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
దేశంలో కొత్తగా 48,268 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 81,37,119కి చేరాయి. ఇందులో 5,82,649 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇది నిన్నటి కంటే 11,737 తక్కువ. అదేవిధంగా కరోనా భారినపడివారిలో 74,32,829 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో కొత్తగా 59,454 మంది కరోనా మహమ్మారి నుంచి బయట పడ్డారు. కాగా, కరోనా వల్ల నిన్న ఉదయం నుంచి ఈరోజు ఉదయం వరకు 551 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,21,641కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది. కరోనా రికవరీరేటు 91 శాతానికి చేరిందని తెలిపింది.