దేశంలో 94లక్షలు దాటిన కరోనా కేసులు

ఢిల్లీ : గడిచిన 24గంటల్లో దేశంలో కరోనా కేసులు 38,772 నమోదయ్యాయి.తాజాగా నమోదైన కేసుల సంఖ్య ఇప్పటివరకూ 94,31,691 కేసులకు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.యాక్టివ్ కేసుల సంఖ్య 4,46,952 కాగా,8.9 లక్షల మంది రికవరీ అయ్యారు.తాజాగా వైరస్‌తో 443 మంది మరణించారు.దీంతో మృతుల సంఖ్య 1,37,139కి చేరింది.అలాగే రికవరీ రేటు 94 శాతానికి చేరింది. ప్రపంచవ్యాప్తంగా పోల్చుకుంటే కరోనా కేసుల సంఖ్య దేశంలో తక్కువగా నమోదవుతోందని కేంద్ర మంత్రిత్వశాఖ తెలిపింది. అయితే,40వేల మార్కుకు తక్కువగా రెండోరోజు 38,772 కేసులు నమోదయ్యాయి.
ఆదివారం నమోదైన మృతుల్లో ఢిల్లీ,మహారాష్ట్ర,వెస్ట్‌బెంగాల్,హర్యానా,పంజాబ్,కేరళ,ఉత్తరప్రదేశ్,రాజస్థాన్‌లోనే 71శాతం నమోదైంది.మహారాష్ట్రలో అత్యధికంగా 89 మంది మరణించారు.ఢిల్లీ 68,వెస్ట్‌బెంగాల్ 54మరణాలు నమోదయ్యాయి.మహారాష్ట్రలో ఆదివారం 5,544 కేసులు నమోదయ్యాయి.ఇది 1.8 లక్షలకు చేరింది.రెండోరోజు 6000 కేసుల కంటే తక్కువగా నమోదైంది.శనివారం వరకు 82,224 పరీక్షలు నిర్వహించినట్లు మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోప్ తెలిపారు.రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి చెందకుండా పరీక్షల సంఖ్యను మరింతగా పెంచాలని జిల్లా అధికారులకు ఆదేశించినట్లు పేర్కొన్నారు.ఢిల్లీలోనూ కేసుల నమోదు సంఖ్య తగ్గుముఖం పడుతోంది.ఇప్పటివరకూ మరణాల సంఖ్య 9000 మార్కును దాటింది.రెండురోజులుగా 5000 కంటే తక్కువ కేసులు నమోదవుతున్నాయి.ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్ పిటిఐతో మాట్లాడుతూ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు.