దేశంలో 96 లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజా బులెటిన్ ప్రకారం కొత్తగా దేశంలో 36,652 కరోనా కేసులు నమోదుకాగా, 512 మంది కరోనాతో మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు 96,08,211 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 90,58,822 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,09,689 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక దేశంలో ఇప్పటి వరకు 1,39,700 మంది కరోనాతో మృతి చేశారు. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 42,533 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యినట్టు కరోనా బులెటిన్ లో పేర్కొన్నారు.
దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 18,42,587 మంది కరోనా బారినపడగా, 47,599 మంది మరణించారు. నిన్న ఒక్కరోజే 5229 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక 8,90,360 పాజిటివ్ కేసులతో కర్ణాటక రెండో స్థానంలో ఉండగా, 8,70,675 కేసులతో ఆంధ్రప్రదేశ్, 7,87,554 కేసులతో తమిళనాడు తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.