దేశరాజధాని ఢిల్లీలో రాత్రి కర్ఫ్యూ

న్యూఢిల్లీ : కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కారు నైట్ కర్ఫ్యూ ప్రకటించింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు, అలాగే జనవరి ఒకటిన రాత్రి 11 నుంచి జనవరి 2వ తేదీ ఉదయం వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. ఈ మధ్యకాలంలో బహిరంగ సమావేశాలకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా కొత్తగా బ్రిటన్ వైరస్ కేసులు నమోదైన నేపథ్యంలో.. నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించాలని కేంద్రం బుధవారం రాష్ట్రాలను కోరింది. కరోనావైరస్ కొత్త ఉత్పరివర్తన పరిస్థితిని ఎదుర్కొనేందుకు నగరం సిద్ధంగా ఉందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు.