ధ‌ర్మారంలో లేగదూడను చంపిన చిరుత

పెద్దపల్లి: ఈ మ‌ధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతున్నది. పెద్ద‌పెల్లి జిల్లాలోని ధర్మారం మండలం పత్తిపాక గ్రామ శివారులో బైరి వెంకన్న అనే రైతుకు చెందిన లేగదూడను గుట్టల్లోకి లాక్కెళ్లి చిరుతపులి చంపేసింది. ఘటనా స్థలాన్ని పెద్దపల్లి డిప్యూటీ రేంజర్ స్వాతి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాజవ్వ సందర్శించారు. ద‌ర్యాప్తు అనంత‌రం  పాదముద్రల ఆధారంగా లేగదూడను చంపింది చిరుతపులే అని నిర్ధారించినట్లు ఫారెస్టు అధికారి స్వాతి నిర్ధారించారు. దానికి సంబంధించిన వివ‌రాల‌ను అధికారులు వెల్ల‌డించారు. అలాగే రాత్రి వేళ‌లో ఒంట‌రిగా గ్రామాల నుంచి ఒంట‌రిగా ఎవ‌రూ బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని సూచించారు. ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.