నాలుగో రౌండ్లో 13 వేల పైచిలుకు..

దుబ్బాక: దుబ్బాక నాలుగో రౌండ్ కౌంటింగ్ ముగిసే సరికి బిజెపికి 13055 ఓట్లతోనూ.. టిఆర్ఎస్ 10371 ఓట్లతో ఉన్నాయి.
4 రౌండ్లు ముగిసేసరికి బీజేపీ 2,684ఓట్ల ఆధిక్యం సాధించింది. ఇంకా 19 రౌండ్ల ఫలితాలు తేలాల్సి ఉంది.
- నాలుగో రౌండ్లోనూ బీజేపీ హవా కొనసాగుతోంది. బీజేపీ నాలుగో రౌండ్లో 1,425 ఓట్లు ఆధిక్యత సాధించగా.. మొత్తంగా రఘునందన్‌రావు 2,684 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నాలుగో రౌండ్ ముగిసేసరికి బీజేపీ 13,055, టీఆర్ఎస్ 10,371 కాంగ్రెస్ 2,158 ఓట్లు సాధించాయి.
- ప్రారంభమైన మిర్దొడ్డి మండల కౌంటింగ్
- ముగిసిన దుబ్బాక మండల కౌంటింగ్
- ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి స్వగ్రామంలో బీజేపీ 110 ఓట్ల ఆధిక్యం సాధించింది.