నాలుగో సారి బిహార్‌ సీఎంగా నితీశ్

ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం

ప‌ట్నా: బీహార్ త‌దుప‌రి ముఖ్య‌మంత్రిగా జేడీయూ అధినేత‌ నితీశ్‌కుమార్ ఎన్నిక‌య్యారు. ఈ ఉద‌యం ప‌ట్నాలో జ‌రిగిన ఎన్డీఏ కూట‌మి ఎమ్మెల్యేల‌ స‌మావేశంలో నితీశ్‌ను ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. నితీశ్‌కుమార్ నివాసంలో జ‌రిగిన స‌మావేశానికి ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తోపాటు బీజేపీ, జేడీయూ, వీఐపీ, హెచ్ఏఎమ్ పార్టీల ఎమ్మెల్యేలు, నేత‌లు హాజ‌ర‌య్యారు. ఎన్డీఏ కూట‌మి ఎమ్మెల్యేలు ముఖ్య‌మంత్రిగా ఎన్నుకోవ‌డంతో నితీశ్‌కుమార్ ఏడోసారి బీహార్ సీఎం పీఠంపై కూర్చోబోతున్నారు. అంత‌కుముందు బీజేపీ, జేడీయూతోపాటు హెచ్ఏఎమ్‌, వీఐపీ పార్టీల‌ ఎమ్మెల్యేలు వేర్వేరుగా స‌మావేశ‌మై త‌మ నేత‌ల‌తో త‌దుప‌రి సీఎం ఎన్నిక‌పై చ‌ర్చించారు. సుదీర్ఘం చర్చల అనంతరం శాసనసభాపక్ష నేతగా నితీష్‌ కుమార్‌ను ఎన్నుకున్నటు ఎన్డీయే ప్రకటించింది.

74 స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ.. కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంలో కీలక పదవులు ఆశించనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ కంటే జేడీయూకి తక్కువ స్థానాలు వచ్చినప్పటికీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు బీజేపీ అగ్రనేతలు నితీష్‌ కుమార్‌నే తదుపరి ముఖ్యమంత్రిగా ఆమోదించారు. ముఖ్యమంత్రిగా రేపు నితీశ్‌ కుమార్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే 125 కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో బీజేపీ 74 స్థానాలు, జేడీయూ 43 స్థానాలు గెలుచుకుంది. ఎన్డీయే కూటమిలో అవామీ మోర్చా, వికాస్‌ వీల్‌ హిన్సాన్‌ చెరో 4 చోట్ల గెలుపొందింది.

 

Leave A Reply

Your email address will not be published.