నితీష్‌ పాలనలో బీహార్‌ నాశనం

తేజస్వి యాదవ్‌ విమర్శలు

పాట్నా : నితీష్‌ కుమార్‌ పాలనలో బీహార్‌ను నాశనం చేశారని ఆర్‌జెడి నేత, మహాఘట్‌బంధన్‌ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్ధి తేజస్వి యాదవ్‌ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగం, వలస కార్మికుల సంక్షోభంపై ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ మాట్లాడాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్‌ చేశారు. ‘ గౌరవనీయులైన ముఖ్యమంత్రి తన 15 ఏళ్ల పాలనలో రాష్ట్ర ఆరోగ్య, విద్య, పరిశ్రమలను నాశనం చేశారని అంగీకరించారు. రెండు తరాల వర్తమాన, భవిష్యత్‌ను కూడా అతను నాశనం చేశారు. నిరుద్యోగం, ఉద్యోగ పరిశ్రమలు, పెట్టుబడులు, వలసలు గురించి అతను మాట్లాడకపోవడానికి ఇదే కారణం. ఈ సమస్యలపై అతను మాట్లాడకూడదా..?’ అని తేజస్వి విమర్శించారు.

Leave A Reply

Your email address will not be published.