నిబద్ధత కలిగిన రాజకీయవేత్త.. కొండా లక్ష్మణ్ బాపూజీ
హైదరాబాద్ః నిబద్ధత కలిగిన రాజకీయవేత్త కొండా లక్ష్మణ్ బాపూజీ అని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు.
సోమవారం ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ ఉద్యమ కారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ… నిరంకుశ నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ అదిలాబాద్ జిల్లా వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్ 27న జన్మించాడు. స్వాతంత్ర్యోద్యమంలో, నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నాడు. 1952లో ఆసిఫాబాదు నుంచి ఎన్నికై హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత కూడా శాసనసభ్యుడిగా నుంచి ఎన్నికై 1971 వరకు శాసనసభ్యునిగా కొనసాగినాడు. నిఖార్సయిన తెలంగాణ వాది. తెలంగాణ కోసం 1969లో మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలిలేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త. 1969, 2009-12 తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్నాడు. రాష్ట్ర చేనేత సహకార రంగానికి కూడా కృషిచేశాడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లేల కుమారస్వామి, మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా,బీసీ సెల్ మండల అధ్యక్షుడు కాంబలా రవి,మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు షకీల్,ఎంపీటీసీ మవూ రాపు తిరుపతి రెడ్డి, మహమ్మద్ గౌస్ పల్లి ఉప సర్పంచ్ కిషన్,గోల్కొండ రవి,ఆత్మ డైరెక్టర్ ఆకు తోట చంద్రమౌళి, శంకరయ్య,జాఫర్,యూత్ కాంగ్రెస్ నాయకులు గణేష్,రాజేష్, ఓంకార్, సునీల్,వినయ్,రాహుల్,సందీప్, గణేష్, తదితరులుపాల్గొన్నారు