నిరుద్యోగ సమస్య నిర్మూలనకు కృషి చేస్తా: ప్రొఫెసర్ కోదండరామ్

సూర్యాపేట:జిల్లాలో హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని విజయ విద్యా మందిర్ హైస్కూల్ నందు సోమవారం జరిగిన కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరామ్ పాల్గొని మాట్లాడుతూ త్వరలో జరగనున్న పట్టభద్రుల (MLC) ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నానని, ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. నిరుద్యోగ సమస్యపై తీవ్రస్థాయిలో నిర్మూలనకు కృషి చేస్తానని కోదండరాం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టభద్రులైన నిరుద్యోగ యువతీ యువకులు, కోదండరాం అభిమానులు పాల్గొన్నారు.