నిర్మల్ ను టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేస్తాం
-మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి... శ్యామ్ ఘడ్ కోటలో లైటింగ్ ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
నిర్మల్: నిర్మల్ ను పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర అటవీ పర్యావరణ, న్యాయ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ నడి బొడ్డున గల శ్యామ్ ఘడ్ కోటను ఆదివారం మంత్రి సందర్శించారు. కోటలో ఏర్పాటు చేయనున్న LED లైటింగ్ పనులను మంత్రి కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ కి ఈ పనులకు అప్పగించారు. 2, 3 వారాల్లో ఈ పనులు పూర్తి చేస్తామని వారు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిమ్మరాజుల కోటలయినటు వంటి నిర్మల్ పురాతన కోటలు బత్తిస్ ఘడ్, శ్యామ్ ఘడ్, కిల్ల గుట్ట, సొన్ పురాతన వంతెన లను పర్యాటక ప్రదేశాలు అభివృద్ధి చేస్తామని అన్నారు. శ్యామ్ ఘడ్ లో LED లైటింగ్ లు ఏర్పాటు చేసి సాయంత్రం 5 తరువాత ప్రజలకు సందర్శనకు అనుమతి ఇస్తామన్నారు కోట చుట్టూ వాకింగ్ ట్రాక్, క్యాంటీన్ ను ఏర్పాటు చేస్తామని. కోట కు ముందు ఉన్న కంచెరోని చెరువులో ఉన్న గుర్రపు డెక్కను తొలగించి బోటింగ్ సదుపాయం కలిపించనున్న మని మొన్న నే చెరువు పైన వీధి దీపాలను సైతం ఏర్పాటు చేశామని మంత్రి అన్నారు. అదే విధంగా సొన్ వంతెన పైన వాకింగ్ కి అనుగుణంగా ఉండేలా లైటింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసి సాయంత్రం వేళల్లో టీ స్నాక్స్ కు సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటదని అన్నారు. జిల్లా కేంద్రంలో పర్యటకుల కోసం హరిత హోటల్ మంజూరు అయ్యిందని పాత ib భవనం దగ్గర హరిత హోటల్ నిర్మిస్తామని తద్వారా కుంటాల పొచ్చేర జలపాతాలకు వెళ్లే సందర్శికులు నిర్మల్ లో ఉండొచ్చు అని అన్నారు. అనంతరం కోటను చెరువును మంత్రి సందర్శించారు.