నేడు గజ్వెల్ లో ముఖ్యమంత్రి పర్యటన
హైదరాబాద్: గజ్వెల్ నియోజకవర్గంలో మంగళవారం ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సంగారెడ్డి కాలువకు గోదావరి నీటిని ముఖ్యమంత్రి రిలీజ్ చేయనున్నారు. అయితే.. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
పర్యటన వివరాలు..
మంగళవారం ఉదయం 10.30 కు వర్గల్ మండలం హౌసుల పల్లి గ్రామంలో సంగారెడ్డి కెనాల్ నుండి హల్దీ వాగులోకి గోదావరి జలాలను సిఎం విడుదల చేయనున్నారు. 11.15 కు మర్కుక్ మండలం పాముల పర్తి గ్రామంలో గోదావరి జలాలను గజ్వేల్ కాలువలోకి విడుదల చేయనున్నారు.