నోముల అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రైన సిఎం కెసిఆర్‌

న‌ల్ల‌గొండ: గుండె పోటుతో మంగ‌ళ‌వారం హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన న‌ల్లొండ జిల్లా నాగార్జున‌సాగ‌ర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మండలం పాలెంలోని స్మృతి వ‌నంలో అంతిమ సంస్కారాలు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ సిఎం కెసిఆర్ హాజ‌ర‌య్యారు. సిఎం గురువారం ఉద‌యం 11:30 గంట‌ల‌కు పాలెం చేరుకుని, నోముల భౌతిక‌కాయం వ‌ద్ద పుష్ప‌గుచ్ఛం ఉంచి నివాళుల‌ర్పించారు. నోముల కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చారు. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు మ‌హ‌ముద్ అలీ, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, జ‌గ‌దీశ్ రెడ్డి, మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, ప‌లువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళుల‌ర్పించారు.

Leave A Reply

Your email address will not be published.