పంచ‌లింగాల వ‌ద్ద‌ భారీగా బంగారం, నగదు పట్టివేత

కర్నూలు: జిల్లాలోని పంచలింగాల చెక్‌పోస్టు వద్ద భారీగా బంగారం, నగదును పోలీసులు పట్టుకున్నారు. ప్రైవేట్ బస్సులో బెంగళూరుకు తరలిస్తుండగా నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రూ.3 కోట్ల 5లక్షల 35వేల 500 నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్ట్‌ చేశారు. మరో ఇద్దరు వ్యక్తుల నుంచి కేజీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సరైన ఆధారాలు లేకపోవడంతో నగదు, బంగారం సీజ్ చేశారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.