పల్లె ప్రగతి పనులను వెంటనే పూర్తి చేయండి
అధికారులకు నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ

నిర్మల్ః పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పల్లె ప్రగతి పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గ్రామాల వారీగా నిర్మాణ పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన స్మశాన వాటికలు, రైతు వేదికల నిర్మాణ పనులను త్వరగతిన పూర్తీ చేయాలనీ ఆదేశించారు. జిల్లాలోని 396 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటివరకు 139 స్మశాన వాటికలను పూర్తీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 582పల్లె ప్రకృతి వనాల ఏర్పాట్లను పూర్తిచేయడం జరిగిందని తెలిపారు. అలాగే జిల్లాకు మంజూరైనా 79 రైతు వేదికలకు గాను ఇప్పటివరకు చిట్యాల, హంపోలి, తాండ్ర లలో పూర్తి చేయడంతో పాటు మిగతా చోట్ల వివిధ దశల్లో నిర్మాణంలో నున్నాయని అన్నారు. కూలీల సంఖ్యను పెంచి త్వరగతిన నిర్మాణ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతు వేదిక ప్రాంగణంలో పచ్చదనం పెంపొందేలా విరివిగా మొక్కలు నాటాలన్నారు. ప్రతి రోజు నిర్మాణ పనులు జరిగేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనుల పురోగతిని ప్రతిరోజు పర్యవేక్షించాలని సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా లోపిస్తే సహించేది లేదని, విధులలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఇంచార్జి డిఆర్ఓ రాథోడ్ రమేష్, జడ్పి సిఈఓ సుధీర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజి ప్రసాద్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, పంచాయతీ రాజ్ శాఖ ఈఈ సుదర్శన్ రావు, ఎంపిడిఓ లు, వ్యవసాయశాఖ ఏవో లు, ఏఈఓలు, పంచాయతీ రాజ్ శాఖ ఏఈ లు తదితరులు పాల్గొన్నారు.