పాంచ్ పటాకా.. మోగిన ఎన్నికల నగారా..

న్యూఢిల్లీ: తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అసోంతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్నికల నగారా మోగింది. వీటితో పాటు 16 రాష్ట్రాల్లోని 34 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమీషనర్ సునీల్ అరోరా ప్రకటించారు. ఈ ఏడాది మార్చి 27 నుంచి ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందిని ఈసీ ప్రకటించింది.
- పశ్చిమ బెంగాల్.. 294(ఎస్సీ-68, ఎస్టీ-16) శాసనసభ స్థానాలకు
- తమిళనాడు.. 234(ఎస్సీ-44, ఎస్టీ-2) స్థానాలకు..
- కేరళ.. 140(ఎస్సీ-14, ఎస్టీ-2) స్థానాలకు..
- అసోం.. 126(ఎస్సీ-8, ఎస్టీ-16) స్థానాలకు..
- పుదుచ్చేరి.. 30(ఎస్సీ-5, ఎస్టీ-నిల్) స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ను సీఈసీ ప్రకటించింది.
నాలుగు రాష్ర్టాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగే ఈ ఎన్నికల పోలింగ్ ఫలితాలను మే 2వ తేదీన ప్రకటించనున్నట్లు సీఈసీ తెలిపారు.
కరోనా జాగ్రత్తలతో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపిన సీఈసీ నాలుగు రాష్ర్టాలు, ఒక యూటీలో మొత్తం 2.7 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 18.68 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు చెప్పారు. పోలింగ్ సమయాన్ని గంటసేపు పెంచుతున్నట్లు వెల్లడించారు.
ఆన్‌లైన్ ద్వారా నామినేషన్‌కు అవకాశం
కరోనా నేపథ్యంలో ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఈసీ తెలిపింది. కరోనా దృష్ట్యా ఈసారి ఆన్‌లైన్ నామినేషన్‌కు అవకాశం కల్పించినట్లు వెల్లడించింది. ఓటువేసేందుకు వచ్చే కరోనా పేషెంట్లకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.
ఎన్నికల తేదీలు..
- కేరళ: మొత్తం 14 జిల్లాల్లో 140 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ 12న విడుదల కానుంది. ఏప్రిల్-6న పోలింగ్ జరగనునంది.
- తమిళనాడు : 234 అసెంబ్లీ ఎన్నికలు జరగున్నాయి. ఒకే దశలో ఏప్రిల్ 6న పోలింగ్.
- అసోం : మూడు దశల్లో ఎన్నికలు జరగతున్నాయి. తొలివిడతలో 47 స్థానాలకు ఎన్నికలు జరగతుండగా మార్చి 2 నోటిఫికేషన్ విడుదల, మార్చి 27న పోలింగ్ నిర్వహించనున్నారు. రెండవ దశలో 39 నియోజకవర్గాలకు ఏప్రిల్ 1న, మూడవ దశ ఏప్రిల్ 6న పోలింగ్ నిర్వహించనున్నారు.
- బెంగాల్ : బెంగాల్‌లో ఎనిమిది విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మార్చి 27న 38 స్థానాల్లో పోలింగ్ జరగనుండగా..మార్చి 27న పోలింగ్ నిర్వహించనున్నారు. రెండవ విడత-.ఏప్రిల్ 1 మూడవ విడత-ఏప్రిల్6న, నాల్గవ విడత-10న , ఐదవ విడత-17న, ఆరవ విడత-22న, ఏడవ విడత-26న, ఎనిమిదో దశ -29 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి.
- పుదుచ్చేరి : పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనున్నాయి.