పాక్‌లో బయటపడిన 1300 ఏళ్ల నాటి ఆలయం

స్వాట్‌: పాకిస్థాన్‌లో అతిపురాతనమైన ఆలయం బయటపడింది… పురావ‌స్తు శాఖ చేపట్టిన తవ్వకాల్లో 1300 ఏళ్ల నాటి పురాత‌న శ్రీమ‌హావిష్ణువు ఆల‌యాన్ని గుర్తించారు.. వాయ‌వ్య పాకిస్థాన్‌లోని స్వాట్ జిల్లాలోబ‌రీకోట్ ఘుండాయ్ ద‌గ్గర‌ పాకిస్థాన్‌‌, ఇటలీకి చెందిన పురావ‌స్తుశాఖ నిపుణులు జరిపిన తవ్వకాల్లో ఈ ఆలయం బయటపడినట్టు పురావ‌స్తు శాఖ చీఫ్ ఫ‌జ‌ల్ ఖాలిక్‌ తెలిపారు. హిందూ షాహి రాజ్యంలో 1300 ఏళ్ల కింద‌ట ఈ ఆల‌యాన్ని నిర్మించిన‌ట్లు ఆయన వెల్లడించారు.

కాగా, హిందూ షాహీస్ లేదా కాబూల్ షాహీస్ ఒక హిందూ రాజ్యవంశంగా చెబుతారు.. క్రీస్తు శ‌కం 850-1026 మ‌ధ్య ఈ వంశ‌స్థులు ఇప్పుడు పాకిస్థాన్‌లో భాగమైన కాబూల్ లోయ‌, గాంధారా, అదేవిధంగా వాయ‌వ్య భార‌త్ ప్రాంతాన్ని పరిపాలించినట్టు చరిత్ర చెబుతోంది. వారే ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా అభిప్రాయపడుతున్నారు. ఇక, ఆల‌య ప‌రిస‌రాల్లో కంటోన్మెంట్‌, వాచ్‌ట‌వ‌ర్ జాడ‌లు కూడా గుర్తించినట్టు పురావ‌స్తు శాఖ అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.