పాడె పై నుంచి లేచినా ప్రాణం మిగ‌ల్లేదు..

చికిత్ పొందుతూ ఒక్క రోజులోనే మృతి

మ‌ద‌న‌ప‌ల్లె: పాపం అభాగ్య‌డుడు.. పాడె వ‌దిలినా ప్రాణం నిల‌వ‌లేదు. అంత్య‌క్రియ‌ల‌కు తీసుకెళ్తుండ‌గా లేచి కూర్చున్న ఓ వ్య‌క్తి.. 24 గంట‌లు గ‌డ‌వ‌క ముందే ప్రాణాలు విడిచారు. చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం కట్టుబావి సమీపంలో ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి అప‌స్మ‌రక స్థితిలో ఉండ‌టంతో చ‌నిపోయిన‌ట్లు భావించి గ్రామ‌స్తులు అంత్య‌క్రియ‌ల‌కు తీసుకెళ్తుండ‌గా లేచి కూర్చున్న ఘ‌ట‌న సోమవారం చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే.. అధికారులు ఆ వ్య‌క్తిని మ‌ద‌న‌ప‌ల్లె జిల్లా ఆసుప‌త్రిలో చేర్పించారు. చికిత్ప పొందుతూ మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున ఆ వ్య‌క్తి మృతి చెందిన‌ట్లు వైద్య సిబ్బంది తెలిపారు.

 

(అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా పాడెపై నుంచి లేచి కూర్చున్న వ్యక్తి)

 

\

Leave A Reply

Your email address will not be published.