పెద్దపల్లి, మెదక్‌కు నూతన కలెక్టర్ల నియామకం

హైదరాబాద్: పెద్దపల్లి, మెదక్ జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమిస్తూ గురువారం రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎంఆర్‌వో ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణను పెద్దపల్లి కలెక్టర్‌గా, రంగారెడ్డి అదనపు కలెక్టర్ ఎస్.హరీశ్‌ను మెదక్ కలెక్టర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ప్రస్తుతం పెద్దపల్లి కలెక్టర్‌గా ఉన్న భారతీ హోళికేరీ, మెదక్ కలెక్టర్‌గా ఉన్న పి. వెంకట్రామిరెడ్డిని ఆయా స్థానాలనుండి సర్కార్ రిలీవ్ చేసింది.