పెసలు – ఔషధ విలువలు

మన ఆహారం లోని పప్పు దినుసుల్లో పెసలు, పెసరు పప్పు ఆరోగ్య పరి రక్షణలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. పెసలు నీటిలో రాత్రి నాన పెట్టి మరు రోజు ఉదయం వుడికుంచి అందులో కొద్దిగా మిరియాల పొడి దాల్చిన చెక్క పొడి వేసి నీరు పోసి సూప్ లా తయారు చేసి తాగితే రక్త పోటు , రక్తం లో చక్కర శాతం తగ్గు ముఖం పడుతుంది. పెసలును నీటిలో నాన పెట్టి మొలక వచ్చేంత వరకు వుంచి మిక్సీలో వేసి ముద్దగా చేసి కొద్దిగా నువ్వుల నూనె పోపులో ఎండు మిరప కాయలు + టమాటా ముక్కలు + ఉప్పు వేసి సూప్ చేసి తాగితే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ముఖ్యంగా కొలెష్ట్రాల్ ను తగ్గించే పీచు పదార్ధం ఉంటుంది. మెగ్నీషియం , బి 6 ఉండటం వలన పెదవులపై పగుళ్లు రాకుండా కాపాడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ లు ఎక్కువగా ఉండటం వలన ఇష్టానుసారం పెరిగే సూక్ష్మ జీవుల పెరుగుదలను అడ్డుకుంటుంది. నానిన పెసళ్లను ముద్దగా చేసి వేడి చేసి చంకలో గడ్డలపై, రొమ్ము గడ్డలపై కడితే వెంటనే తగ్గి పోతాయి వాపులపై కూడా కట్టుకోవచ్చు.
-పి . కమలాకర్ రావు