పొగమంచుతో నిండిన గండి క్షేత్రం.. యాత్రికుల కనువిందు!

చక్రాయపేట(కడప): కడప జిల్లా చక్రాయపేట మండలంలోని పుణ్యక్షేత్రమైన గండి క్షేత్రాన్ని పొగ మంచు కప్పివేయడంతో శీతల సోయగాలతో యాత్రికులను కనువిందు చేస్తోంది. ఇటీవల తుపానుల ప్రభావంతో కురిసిన వర్షాలకు గండి క్షేత్రం చుట్టూ ఉన్న శేషాచల కొండల్లో పచ్చగా ఆహ్లాదకర వాతావరణాన్ని సంతరించుకుంది. కొండలన్నీ మంచు దుప్పటి కప్పుకోగా మసక వాతావరణంలోనే గండి అంజన్నను దర్శించుకోవడానికి వస్తున్నారు. గండి ఆలయ పరిసరాలతో సహా పరిసర రహదారుల్లో కమ్ముకున్న మంచు పొరలు చూపరుల మనస్సును దోచుకుంటోంది. మరోవైపు స్వామి సన్నిధిలో ప్రవహిస్తున్న పాపాఘ్న నది జల సవ్వడులపైహొకూడా మంచు కురుస్తూ చూడచక్కగా కనిపిస్తోంది. ఇంతటి ఆహ్లాదకర వాతావరణంలో యాత్రికులను ఆనందపరవశులవుతున్నారు.