ప్రచారానికి అనుమతి తప్పనిసరి: సీపీ సజ్జనార్

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నిన్నటితో నామినేషన్ల పర్వం కూడా ముగిసిపోయింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పాదయాత్రలు, ర్యాలీలు, సమావేశాలు, మొబైల్ ప్రచారం చేసుకునేందుకు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ శుక్రవారం తెలిపారు. ప్రతి రాజకీయ పార్టీ.. 48 గంటల ముందు డీసీపీ, ఏసీపీ నుంచి రాతపూర్వకంగా అనుమతులు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. లౌడ్ స్పీకర్లు, మొబైల్ ప్రచారానికి కూడా అనుమతులు తప్పరిసరని చెప్పారు.