ప్రపంచవ్యాప్తంగా పది మందిలో ఒకరికి కరోనా

జెనీవా: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు పది మందిలో ఒకరు కరోనా బారినపడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సోమవారం తెలిపింది. ప్రపంచంలోని మెజార్టీ జనాభాకు కరోనా ముప్పు ఉన్నదని హెచ్చరించింది. కరోనాతో సంబంధిత రోగాలతో చాలా మంది సతమతమవుతున్నారని తెలిపింది.
కరోనా సోకిన వారిలో దేశాల వారీగా వ్యత్యాసం ఉన్నదని చెప్పింది. ప్రపంచం మరింత కష్టకాలన్ని ఎదుర్కోనున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. సోమవారం జరిగిన డబ్ల్యూహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఆ సంస్థ టాప్ ఎమర్జెన్సీ ఎక్స్పర్ట్ మైక్ ర్యాన్ ఈ మేరకు తెలిపారు. ఆగ్నేయ ఆసియా, ఐరోపాలోని కొన్ని ప్రాంతాలు, తూర్పు మధ్యధరా ప్రాంతంలో కరోనా కేసుల తీవ్రత, మరణాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నదని పేర్కొన్నారు.