ప్రముఖ చిత్రకారుడు చంద్ర కన్నుమూత

హైదరాబాద్ (CLiC2NEWS): ప్రముఖ చిత్రకారుడు, రచయిత చంద్ర (74) కరోనాతో కన్నుమూశారు. గత మూడేండ్లుగా నరాలకు సంబంధించిన చికిత్స తీసుకుంటున్న చంద్రను కరోనా మహమ్మారి బలితీసుకుంది. సికింద్రాబాద్‌లోని మదర్ థెరిసా రీహాబిలిటేషన్ సెంటర్‌లో చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని బంజారాహిల్స్ శ్రీనగర్‌లోని నివాసానికి తరలించారు. వరంగల్‌కు చెందిన చంద్ర.. 1946, ఆగస్టు 28న జన్మించారు. కొన్ని వేల కొద్ది తెలుగు పుస్తకాల కవర్ పేజీలు ఆయన చేతిలో రూపుదిద్దుకున్నాయి. వివిధ పత్రికల్లో కథలకు బొమ్మలు గీశారు.