ప్రారంభమైన టీకా రిజిస్ట్రేష‌న్‌.. మొరాయింపు..!

న్యూఢిల్లీ (CLiC2NEWS): క‌రోనా ఉధృతి నేప‌థ్యంతో మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి కోసం దేశంలో చేప‌డుతున్న వ్యాక్సినేష‌న్ లో భాగంగా 18 ఏళ్లు దాటిన వారంద‌రికి టీకా న‌మోదు ప్ర‌క్రియ బుధ‌వారం (ఏప్రిల్ 28) సాయంత్రం 4 గంట‌ల‌నుంచి మొద‌లైంది. www.cowin. gov. in వెబ్‌సైట్‌లో లేదా ఆరోగ్య సేతు యాప్ లో రిజిస్ట్రేషన్ ప్రారంభంమైన కొద్ది సేప‌టికే కోవిన్, పోర్ట‌ల్‌లో లాగిన్ అయ్యేందుకు ప్ర‌య‌త్నించ‌డంతో వెబ్‌సైట్ కొద్ది సేపు క్రాష్ అయ్యింది. చాలా మందికి స‌మ‌స్య‌లు తలెత్త‌డంతో వారంతా సోష‌ల్ మీడియాలో అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. రిజిస్ట్రేష‌న్ మొద‌లైన కొన్ని నిముషాల్లోనే ఈ స‌మ‌స్య త‌లెత్తింది. ఒకేసారి పెద్ద సంఖ్య‌లో రిజిస్ట్రేష‌న్ చేసుకోవ‌డానికి ఎగ‌బ‌డ‌డంతో ఈ ప‌రిస్థితి వ‌చ్చింద‌ని చెబుతున్నారు.

ప్ర‌స్తుతం కోవిన్ సర్వర్ సమస్యలను ఎదుర్కొంటోంది, దయచేసి త‌ర్వాత ప్రయత్నించండి అని మెసేజ్ చూపిస్తోంది.. సమయం ముగిసే లోపాలు, 504 గేట్‌వే ఎర్ర‌ర్ కూడా వ‌స్తుంద‌ని బాధితులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే వేల సంఖ్యలో లాగిన్‌ కావడానికి ప్రయత్నించగా, సర్వర్‌ క్రాష్‌ అయ్యింది. అయితే సర్వర్లు క్రాష్ అవుతున్నాయని వినియోగదారులు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. వినియోగదారులు లాగిన్ కావడానికి అవసరమైన వన్ టైమ్ పాస్వర్డ్(OTP) కూడా రావడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఒకేసారిగా అధిక మొత్తంలో రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కొంత మందికి ఒటిపిలు ఆల‌స్యంగా వ‌చ్చాయి. అయితే ప్ర‌స్తుతం కొవిన్ పోర్ట‌ల్‌లో రిజిస్ట్రేష‌న్ అందుబాటులోనే ఉంది.

Leave A Reply

Your email address will not be published.