ప్రియుడితో కలిసి క‌న్న‌కొడుకును కడతేర్చిన త‌ల్లి

కృష్ణాజిల్లాలో దారుణ సంఘటన

జగ్గయ్యపేట: ప‌్రియుడి మోజులో ప‌డి.. వారి సంతోషాల‌కు అడ్డువ‌స్తున్నాడ‌ని క‌న్న కొడుకునే క‌డ‌తేర్చింది ఓ త‌ల్లి. ఈ దారుణ ఘ‌ట‌న కృష్ణా జిల్లాలోని జ‌గ్గ‌య్య‌పేట మండ‌లంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లికి చెందిన ఉష రెండు నెలల క్రితం భర్తతో విడిపోయింది. కొన్ని రోజుల నుండి ప్రియుడితో కలిసి ఉంటోంది.

ఉషకు ఇద్దరి కుమారులు. వారు కూడా ఉష‌తోనే ఉంటున్నారు. కాగా కొడుకు వీరి సంతోషాల‌కు అడ్డు ప‌డుతుండ‌టంతో వారికి ఎలాగైనా అడ్డు తొల‌గించుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ప్ర‌యుడు శ్రీ‌నుతో క‌లిసి త‌న చిన్న కొడుకును చంపేసింది. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని తెలంగాణలోని కోదాడ వద్ద పూడ్చి పెట్టారు. వీరి వ‌ద్ద కొన్ని రోజుల నండి బాబు క‌నిపించ‌క‌పోవ‌డం, వీరి వ్య‌వ‌హార‌శైలిపై ఇరుగుపొరుగుకు అనుమానం వ‌చ్చి పోలీసుల‌కు తెలిపారు. పోలీసులు పోలీసులు ఉషతో పాటు శ్రీనును అదుపులోకి తీసుకుని వారి ప‌ద్ధ‌తిలో విచారించగా నేరం చేసిన‌ట్లు అంగీక‌రించారు.

Leave A Reply

Your email address will not be published.