ప్రియురాలి స‌మాధి వ‌ద్ద ప్రియుడు ఆత్మ‌హ‌త్య‌

మ‌హ‌దేవ‌పూర్‌: త‌న ప్రియురాలు లేని లోకంలో ఉండ‌లేనంటూ యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న మ‌హ‌దేవ్‌పూర్ మండ‌లంలోని కుదురుప‌ల్లి గ్రామంలో ఆదివారం ఉద‌యం చోటు చేసుకుంది. ఎస్సై అనిల్ కుమార్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం మ‌మ‌దేవ‌పూర్ గ్రామానికి చెందిన చ‌ల్లా మ‌హేశ్ (24) టిఎస్ఎండిసిలో వాలంటీర్‌గా పని చేస్తున్నాడు. ఈయ‌న ఓ యువ‌తిని ప్రేమించాడు. ఒక‌ర్ని విడిచి మ‌రొక‌రు ఉండ‌లేని ప‌రిస్థితి. అయితే అనారోగ్యంతో ప్రియురాలు మృతి చెందింది. త‌న ప్రేయ‌సి ఈ లోకాన్ని విడిచిపోవ‌డంతో.. తాను బ‌తికి లాభం లేద‌నుకున్నాడు ప్రియుడు. తాను కూడా త‌న ప్రియురాలి వ‌ద్ద‌కే వెళ్తాన‌ని ఆమె స‌మాధి వ‌ద్ద ఉరేసుకున్నాడు. అయితే ఆత్మ హ‌త్య చేసుకునే ముందు వాట్స‌ప్ స్టేటస్ పెట్టుకున్నాడు. ఈ విష‌యం తెలిసి కుటుంబ‌సభ్యులు, స్నేహితులు అక్క‌డి వెళ్లేస‌రికి మ‌హేశ్ మృతి చెందాడు. పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకుని కేసు న‌మోదు చేసి ద్య‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.