ప‌లు జిల్లాల్లో నేడు వర్ష సూచన!

హైదరాబాద్‌: వాతావ‌ర‌ణంలో వ‌చ్చిన మార్పుల‌తో తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణం కేంద్రం తెలిపింది. ఇంటీ‌రి‌యర్ తమి‌ళ‌నాడు నుంచి ఇంటీ‌రి‌యర్‌ కర్ణా‌టక దాకా 0.9 కిలో‌మీ‌టర్ల ఎత్తు‌వ‌రకు ఉన్న ఉప‌రి‌తల ద్రోణి బల‌హీ‌న‌ప‌డింది. వాతా‌వ‌ర‌ణంలో వచ్చిన మార్పులతో గురు‌వారం హైద‌రా‌బాద్‌ కాస్త చల్లబడింది. కుమ్రంభీం ఆసి‌ఫా‌బాద్ జిల్లా సిర్పూర్‌ (యూ)లో 10.6 మిల్లీ‌మీ‌టర్ల వర్షం కురి‌సి‌నట్టు టీఎ‌స్‌‌డీ‌పీ‌ఎస్‌ తెలి‌పింది.

Leave A Reply

Your email address will not be published.