ప.గో జిల్లాలో 8 మంది విద్యార్థులకు కరోనా
ప్రకాశంలో పలు పాఠశాలల్లో కరోనా కలకలం
ఏలూరు/ఒంగోలు: దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండటం.. మరోవైపు శీతాకాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఆంధ్రపదేశ్‌లో పాఠశాలలు ఈ మధ్యనే పున: ప్రారంభం అయిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి విజృంభణ, లాక్డౌన్ కారణంగా గత కొన్ని నెలలుగా బడులు బందయ్యాయి. చాలా రోజుల తర్వాత దేశంలోని పలు రాష్ట్రాలు ఈ మధ్యనే పాఠశాలు తెరిచారు. అయితే ఎపిలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ రావడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది.
పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం ఈస్ట్ఎడవల్లిలో 8 మంది స్కూల్ విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. దీంతో విద్యార్థులను హోం ఐసోలేషన్ లో ఉంచుతూ చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఒక్కసారిగా తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇంతకాలం ఇళ్లకే పరిమితమైన పిల్లలు కొవిడ్ బారిన పడటంతో కంగారుపడుతున్నారు. మరోవైపు, కొవిడ్ నిబంధనలను పాటిస్తూ బడులు నిర్వహిస్తామని విద్యాధికారులు ప్రకటిస్తున్నారు.
పలు పాఠశాలల్లో కరోనా కలకలం
ప్రకాశం: ప్రకాశం జిల్లాలోని పలు పాఠశాలల్లో కరోనా కలకలం రేపుతోంది. జిల్లాలోని నాలుగు జెడ్పీ హైస్కూళ్లలోని ఉపాధ్యాయులు, విద్యార్థులకు వ్యాధి సోకినట్లు తెలుస్తోంది. జరుగుమల్లి మండలం పచ్చవలో ఇద్దరు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయునికి, త్రిపురాంతకం హైస్కూల్లో ఉపాధ్యాయుడికి, పీసీపల్లిలోని హైస్కూల్లో ఓ విద్యార్థి, ఉపాధ్యాయునికి, పెద్దగొల్లపల్లి హైస్కూల్లో మరో ఉపాధ్యాయునికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. డిఇఒ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
[…] ప.గో జిల్లాలో 8 మంది విద్యార్థులకు కర… […]