ఫిషింగ్‌ హార్బర్లకు సిఎం జగన్‌ శంకుస్థాపన

అమరావతి : ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు అంతర్జాతీయ మౌలిక సదుపాయాలతో కూడిన బృహత్తర ప్రాజెక్టుకు ఎపి స‌ర్కార్ శ్రీకారం చుట్టింది. తొలిదశలో భాగంగా నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్మించనున్న నాలుగు ఫిషింగ్‌ హార్బర్లకు సీఎం వైఎస్‌ జగన్‌ వర్చువల్‌ విధానంలో శనివారం శంకుస్థాపన చేశారు. మరో నాలుగు చోట్ల కూడా ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీంతోపాటు 25 ఆక్వాహబ్‌ల నిర్మాణ పనులకు కూడా సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు.
మరో నాలుగు చోట్ల కూడా ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీంతోపాటు 25 ఆక్వాహబ్‌ల నిర్మాణ పనులకు కూడా సిఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. రూ.15,10 కోట్లతో ఈ ఫిషింగ్‌ హార్బర్లు నిర్మిస్తున్నామని తెలిపారు. మత్స్యకారుల జీవితాలు దయనీయస్థితిలో ఉండటం పాదయాత్రలో చూశానని, సరైన సౌకర్యాలు లేక గుజరాత్‌ లాంటి ప్రాంతాలకు వలసపోవడం బాధాకరమని అన్నారు. ఎపికి పెద్ద సముద్ర తీరం ఉన్నా అవసరమైన ఫిషింగ్‌ హార్బర్లు లేవన్నారు. మత్స్యకారుల జీవితాలు మార్చేందుకు ప్రతి హామీనీ నిలబెట్టుకుంటున్నామని పేర్కొన్నారు. రూ.225 కోట్లతో నియోజకవర్గాని ఒక ఆక్వాహబ్‌ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. జనతా బజార్లలో నాణ్యమైన రొయ్యలు, చేపలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడులో మరో మూడు పోర్టుల నిర్మాణాన్ని చేపడుతామని పేర్కొన్నారు. మొత్తం ఎనిమిది ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి రూ.3 వేల కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.