బడికి వెళ్లిన తొలిరోజే విద్యార్థికి కొవిడ్‌ పాజిటివ్‌

డెహ్రాడూన్‌ : క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ, లాక్‌డౌన్‌తో మూసివేయ‌బ‌డిన‌ పాఠ‌శాల‌లు పలు రాష్ట్రాల్లో తిరిగి ప్రారంభమయ్యాయి. తరగతులు ప్రారంభమైన తొలిరోజే ఓ విద్యార్థి కొవిడ్‌ పాజిటివ్‌గా పరీక్షించడంతో 15 మంది విద్యార్థులను ఐసోలేషన్‌కు తరలించారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకుంది. రానీఖేట్‌లో 18 ఏళ్ల విద్యార్థి సోమవారం పాఠశాలకు రాగా.. పరీక్షలు నిర్వహించడంతో విషయం తెలిసిందని స్టేట్‌ కంట్రోల్‌ రూం నోడల్‌ ఆఫీసర్‌ జేసీ పాండే తెలిపారు. విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. సుమారు ఏడు నెలల తర్వాత తిరిగి ప్రారంభ‌మైన బ‌డులతో త‌ల్లిదండ్రులు ఒక వైపు సంతోషం.. మ‌రోవైపు ఆందోళ‌న చెందుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.