బహర్ అలీ: పార్శ్వ కోణాసనం

చేయువిధానం:

1. ఆసన స్థితిలో నిటారుగా నిలబడవలెను.

2. తరువాత రెండు పాదములు సుమారు 2 మీటరుల దూరంలో ఉంచవలెను.

3. కుడి పాదము నెడమ పాదమునకు 90″డిగ్రీల కొణములో నుండునట్లు కుడి ప్రక్కకు తిప్పుము.

4. ఎడమ కాలును తిన్నగా ఉంచి, రెండు కాళ్ళ మధ్య దూరమును తగునట్లుగా సర్దుబాటు చేసుకొని కుడి కాలును మోకాలి వద్ద 90″డిగ్రీల కోణములో వంచుము. ఊపిరి విడుచుచు, కుడి అరచేతిని కుడి పాదమునకు, కుడి వైపున నేలపై ఆనించి శరీరమును కుడి తొడ ప్రక్కకు తెమ్ము.

5. ఎడమ చేతిని చెవి మీదుగా శరీరం యొక్క వరసలో చాపి, మోచేయి మీదుగా చూడుము. ఊపిరి పీల్చుము. ఎడమ అరికాలును పూర్తిగా నేలపై నుంచుము.

6. ఒక నిముషము పాటు అదే స్థితిలో సాధారణ ఉఛ్వాస నిశ్వాసలను నుంచుము.

7. తిరిగి యధా స్ధితిలో వచ్చి తిరిగి అలానే కుడి కాలు మీద మీద చేయాలి. (వ్యతిరేక దిశలో)

ప్రయోజనాలు:

  • రొమ్ము కండరములు విస్తరించును.
  • తొడలయందలి దోషములు నివారణమగును.
  • విపు నొప్పి తొలిగించును.
  • మలబద్దకం నిర్మూలించబడును.

-షేక్.బహర్ అలీ.
యోగాచార్యుడు

 

త‌ప్ప‌క చ‌ద‌వండి:బహర్ అలీ: పరివృత్త త్రికోణాసనం
( స్త్రీ, పురుషులకు ఉపయోగకరమైన త్రికోణాసనం)
(షేక్.బహర్ అలీ: శిశిర ఋతువులో చ‌క్క‌టి ఆరోగ్యానికి..)

Leave A Reply

Your email address will not be published.