బహుజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ పరిరక్షణ సదస్సు..

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో మహానీయుల జయంతోత్సవాలలలో భాగంగా బహుజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సోమవారం భారత రాజ్యాంగ పరిరక్షణ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య వక్తలుగా ప్రో.మల్లేశం, ప్రో.మురళీ దర్శన్, ప్రో.ప్రభంజన్ యాదవ్, ప్రో.పంతుకాల శ్రీనివాస్ లు హాజరై ప్రసంగించారు. ఈ కార్యమానికి బహుజన్ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల సంజయ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రో. మల్లేశం మాట్లాడుతూ.. బారత రాజ్యాంగంను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందన్నారు. భారత దేశంలో మొత్తం ప్రభుత్వం రంగ సంస్థలను ప్రయివేటు పరం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ భాద్యతలనుండి తప్పుకోవాలని చూస్తున్నాయన్నారు. ప్రొ. ప్రభంజన్ యాదవు మాటాడుతూ భారత రాజ్యాంగమే ఈ దేశ ప్రజలని కలిపిందని గుర్తు చేశారు. అందువలన భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని చేరిపివేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బహుజన విద్యార్థి సంఘాల నాయకుడు నలిగంటి శరత్ మాటాడుతూ భారత రాజ్యాంగాని రక్షించుకోవాలంటే బహుజనులు తెలంగాణ రాష్ట్రంలో అధికారం లోకి రావడమే పరిష్కారం అన్నారు. అందుకే బహుజన విద్యార్తి సంఘాల ఆధ్వర్యంలో త్వరలోనే బహుజన రాజకీయ చైతన్య రథయాత్రలు మొదలు పెడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు పులిగంటి వేణుగోపాల్, కొత్తపల్లి తిరుపతి, నాన్ టీచింగ్ ఉద్యోగ సంఘాల నాయకులు బోయ కుమార్, శంకరయ్య, నరేష్, మేడి రమణ, శరత్ నాయక్, అంబేద్కర్, సునీల్ శెట్టి, జాన్, తిరుమలేశ్ తదితరులు పాల్గొన్నారు.