బాణాసంచాపై నిషేధాన్ని పట్టించుకోని ప్రజలు..
రాజధాని ఢిల్లీలో భారీగా పెరిగిన వాయు కాలుష్యం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సహాల మధ్య దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కరోనా నేపథ్యంలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాల్లో క్రాకర్ల వినియోగంపై ఉన్న నిషేధాన్ని ప్రజలు పట్టించుకోలేదు. దేశంలోని అన్ని ప్రాంతాలతోపాటు ఢిల్లీలో కూడా నిషేధాన్ని ఉల్లంఘించి క్రాకర్లను పెద్ద ఎత్తున కాల్చారు. దీంతో ఢిల్లీతోపాటు, దాని పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. శనివారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ఎక్యూఐ(ఎయిర్ క్వాలిటి ఇండెక్స్) సగటు 468గా ఉంది. అది రాత్రి ఎనిమిది గంటలయ్యే సరికి చాలా ప్రాంతాల్లో ఐదు వందలకు చేరుకుంది. రాత్రికి ఢిల్లీలో అది ఎనిమిది వందల పాయింట్లకు చేరింది. ఢిల్లీలో క్రాకర్ల అమ్మకాలు, వినియోగాన్ని నవంబర్9వ తేదీ నుంచి నవంబర్ 30 వరకు నిషేధిస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశిలిచ్చింది. దేశవ్యాప్తంగా కూడా క్రాకర్స్ వినియోగాన్ని నిషేధించింది. కానీ దీపావళి రోజు ఆదేశాలను ఎవరూ పట్టించుకోలేదు. అందరూ క్రాక్రర్స్ను కాల్చడంతో దేశవ్యాప్తంగా కాయు కాలుష్యం పెరిగింది.