బాణాసంచా బదులు దీపాలను వెలిగించండి: ఉద్ధవ్

ముంబయి: కాలుష్యం వల్ల కోవిడ్ విజృంభించే ప్రమాదముందని, అందుకే దీపావళికి బాణాసంచా బదులు దీపాలను వెలిగించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ పిలుపునిచ్చారు. దీపావళి తరువాత దేవాలయాలను తెరుస్తామని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రకటించారు. దేవాలయాలను ఎప్పుడు తెరుస్తారని కొందరు అడుగుతున్నారని, తొందర్లోనే తెరుస్తామని తెలిపారు. దీపావళి తర్వాత కొన్ని నియమనిబంధనలను రూపొందిస్తామని ఆయన ప్రకటించారు. ‘‘వృద్ధులు దేవాలయాలను సందర్శిస్తారు. దీంతో కోవిడ్ సోకే ప్రమాదముంది. అందువల్ల రద్దీని నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఏ ప్రార్థనా మందిరమైనా కావచ్చు..’’ అని ఉద్ధవ్ ప్రకటించారు.
ఈ విషయంలో ప్రజలు తీవ్రంగా తనను విమర్శిస్తున్నారని, ఆ విమర్శలను ఎదుర్కోడానికి సిద్ధంగానే ఉన్నానని థాకరే తెలిపారు. వృద్ధుల విషయంలో తమ ప్రభుత్వం చాలా అప్రమత్తతతో వ్యవహరిస్తుందని ఆయన తెలిపారు. కాలుష్యం వల్ల కోవిడ్ విజృంభించే ప్రమాదముందని, అందుకే దీపావళికి బాణాసంచా బదులు దీపాలను వెలిగించాలని ఆయన పిలుపునిచ్చారు. దీపావళి తరువాత 15 రోజులు చాలా ముఖ్యమైనవి. లాక్‌డౌన్ అవసరం మళ్లీ తలెత్తకుండా మనం జాగ్రత్తగా ఉండాలని ఉద్ధవ్ పేర్కొన్నారు.