బాలల భవిష్యత్ కు ఊతం..
ముస్కాన్ తో చిగురించే ఆశలు.. చిన్నారుల గుర్తింపు.. తల్లిదండ్రులకు అప్పగింత

మండపేట (CLiC2NEWS): బాలల భవిష్యత్ కు ఆపరేషన్ ముస్కాన్ ఊతం ఇస్తుందని మండపేట రూరల్ ఎస్ ఐ రావూరి మురళి మోహన్పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా చిన్నారుల ఆశలు చిగురిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మండపేట మండలం లో కొందరు చిన్నారులను గురువారం గుర్తించారు.వారిని ఇప్పన పాడు రూరల్ స్టేషన్ కు తీసువచ్చి కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం వారి తల్లిదండ్రులు, సంరక్షకుల కు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్ ఐ మీడియా తో మాట్లాడుతూ క్రిమినల్స్ రికార్డులు తిరగేస్తే వారిలో ఎక్కువమంది అనాథలు, లేదంటే ఇంట్లోంచి చిన్నప్పుడే పారిపోయి వచ్చేసినవారు ఉంటారన్నారు. వీరికి ఎదగడానిక వేరే అవకాశం లేక.. తిండికి కూడా ఎదురు చూస్తూంటారని పేర్కొన్నారు. మాఫియా ఇలాంటివారినే టార్గెట్ చేసి వారికి ట్రయినింగ్ ఇచ్చి క్రిమినల్స్ గా మార్చి సమాజంపైకి ఉసిగొల్పుతుందని పేర్కొన్నారు. నేరస్తుడిని పట్టుకోవడం కంటే నేరాన్ని నియత్రించడమే కరెక్టనే కాన్సెప్టును అనుసరించి పిల్లలను నేరస్తులుగా మారకముందే వారిని సన్మార్గంలో పెట్టాలనే ఉద్దేశంతో నడిపే ఆపరేషన్ ముస్కాన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆయా పిల్లలకు మాస్క్ లు సానిటైజేర్ లు అందించారు. ఎక్కడైనా చిన్నారులు పనుల్లో ఉన్నట్లు గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో పోలీసులు పాల్గొన్నారు.ద్వార పూడి ,జెడ్ మేడ పాడు,ఇప్పన పాడు, వేములపల్లి లలో మొత్తం ఆరుగురు పిల్లలను గుర్తించినట్లు ఎస్ ఐ తెలిపారు.