బాలికను బెదిరిస్తూ 6 నెలలుగా దారుణం!

ప్రకాశం : ఎన్ని కొత్త చ‌ట్టాలు వ‌చ్చినా కామాంధుల ఆగ‌డాలు ఆగ‌డం లేదు. నాటి నుండి `దిశ‌` కేసు వ‌ర‌కు మ‌న ప్ర‌భుత్వాలు ఎన్ని కొత్త చ‌ట్టాలు తెచ్చిన అవి కామాందుల ఆగ‌డాల‌కు అడ్డుక‌ట్ట వేయ‌లేక‌పోతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. ఓ బాలికపై బెదిరింపులకు పాల్పడుతూ ఆరు నెలలుగా అత్యాచారం చేశాడో కామాంధుడు. ఈ దారుణ ఘటన జిల్లాలోని సింగరాయకొండలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాత సింగరాయకొండ బాలిరెడ్డి నగర్‌కు చెందిన యుగందర్‌ అనే వ్యక్తి తన వద్ద పనిచేస్తున్న 15 సంవత్సరాల బాలికపై బెదిరింపులకు పాల్పడి గత ఆరు నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బాలిక అనారోగ్యం పాలైంది. దీంతో తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం ఆమెపై అత్యాచారం జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు యుగందర్‌, అతడి భార్యపై ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Leave A Reply

Your email address will not be published.