బావిలో పడ్డ చిరుత పులి..

వేములవాడ:ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో పులుల సంచారం వార్తలు తరచూ వింటూనే ఉన్నాం.. అయితే తాజాగా ఓ చిరుత పులి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ వ్యవసాయ బావిలో పడింది. జిల్లాలోని బోయినపల్లి మండలం మల్కాపూర్ శివారులోని వ్యవసాయ బావిలో రాత్రి చిరుత పడ్డట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీశాఖ అధికారులు, రెస్క్యూ టీం దాన్ని రక్షించే పనిలో నిమగ్నమయ్యారు. ఇక చిరుతను చూసేందుకు పెద్దసంఖ్యలో జనం బావి వద్దకు చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
[…] బావిలో పడ్డ చిరుత పులి.. […]