బిజెపియేతర మంత్రి లేని ఎన్‌డిఎ!

న్యూఢిల్లీ : నేషనల్ డెమొక్రెటిక్ అలయన్స్ (ఎన్డీయే) ఉన్న‌ది కేవ‌లం బిజెపియే కేంద్ర మంత్రి వర్గంలో ప్రస్తుతానికి ఉన్నది బీజేపీ వారు మాత్రమే. ఒక్క రాందాస్ అథవాలే తప్ప. 1977 అనంతరం కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వంలో ఒకే పార్టీకి చెందిన వ్యక్తులు క్యాబినెట్‌ మంత్రులుగా కొనసాగడం ఇదే మొదటిసారి. గురువారం రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ మరణించడంతో పాటు వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా గత నెల శిరోమణి అకాలీదళ్‌ కూటమి నుండి బయటకి వచ్చింది. మొత్తం 51 మంది సభ్యుల బలమైన యూనియన్‌ మంత్రులలో బిజెపి యేతర మంత్రి ఒక్కరు మాత్రమే ఉన్నారు. రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ రామ్‌దాస్‌ అథవాలే (సామాజిక న్యాయం, సాధికారిత రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. 24 రాజకీయ పార్టీల బిజెపి నేతృత్వంలోని కూటమి 2019లో భారీ మెజారిటీ సాధించిన అనంతరం మిత్రపక్షాలకు చెందిన ముగ్గురికి అధికార పీఠాలను కట్టబెట్టింది. శివసేనకు చెందిన అనంత్‌గీతను భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా, అకాలీదళ్‌కు చెందిన హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ను ఆహార ప్రాసెసింగ్‌ మంత్రిగా, అలాగే రామ్‌విలాస్‌ పాశ్వాన్‌కు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీశాఖలను అప్పగించింది. గత ఏడాది మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడటంతో శివసేనకు చెందిన గీత కేబినెట్‌ పదవికి రాజీనామా చేశారు. బిజెపి అనంతరం జనతాదళ్‌ (యునైటెడ్‌) 15 మంది ఎంపిలతో ఎన్‌డిఎ కూటమిలో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్డీయే కూటమిలో నితీశ్ (జేడీయూ) ఉన్నప్పటికీ వారు కేంద్ర మంత్రి వర్గంలో ప్రాతినిథ్యం వహించడం లేదు. నితీశ్ అడిగిన శాఖలను బీజేపీ తిరస్కరించడంతో బయటి నుంచే మద్దతిస్తామని నితీశ్ స్పష్టం చేశారు.

రాజ్యాంగం ప్రకారం ప్రధాని మోదీ 80 మంది మంత్రులను నియమించుకునేందుకు అవకాశం ఉంది. ప్ర‌స్తుతం కేంద్ర మంత్రివర్గంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాకుండా 57 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో 24 మంది కేబినెట్, 9 మంది సహాయ మంత్రులు(స్వతంత్ర హోదా), 24 మంది సహాయ మంత్రులు. అరవింద్‌ సావంత్, హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ రాజీనామా, పాశ్వాన్‌ మరణంతో కేబినెట్‌ మంత్రుల సంఖ్య 21కి పడిపోయింది. అలాగే రైల్వేశాఖ సహాయ మంత్రి సురేశ్‌ అంగడి మృతితో సహాయ మంత్రుల సంఖ్య 23కు పడిపోయింది.

Leave A Reply

Your email address will not be published.