బిజెపి నేత పురందేశ్వరికి కరోనా పాజిటివ్
హైదరాబాద్ : బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న పురందేశ్వరి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొద్దికాలంగా తనకు సన్నిహితంగా ఉన్న వ్యక్తులు, తన కుటుంబ సభ్యులు, బంధువులు కరోనా పరీక్షలు చేయించుకోవాలని పురందేశ్వరి సూచించారు.