బురేవి ఎఫెక్ట్: తిరుమలలో భారీ వర్షం

తిరుమ‌ల‌: వ‌రుస తుఫాన్ల‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ అత‌లాకులం అవుతోంది. ఇప్పటికే వ‌చ్చిన తుఫాన్‌తో రాష్ట్రంలోని రైతులు తీవ్రంగా నష్టపోయారు. అంచనా వేయలేని పంటనష్టం జరిగింది. ప్రస్తుతం బురేవి తుఫాన్‌ ఎఫెక్ట్‌తో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా తిరుమలలో ఎడతెరపు లేకుండా వర్షం కురుస్తోంది. శ్రీవారి ఆలయ ప్రాంతంలో మాడవీధులు, కాటేజీలు, రోడ్లు, పార్కులు జలమయమయ్యాయి. దీంతో భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఘాట్ రోడ్లపై కొండచరియలు, వృక్షాలు పడే అవకాశమున్న చోట్ల అధికారులు నిఘా పెట్టారు. కాగా.. బురేవి తుఫాన్‌ గురువారం సాయంత్రానికి తమిళనాడులోని పంబన్‌ పరిసరాల్లో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి శుక్రవారం ఉదయం తీరం దాటుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Leave A Reply

Your email address will not be published.