బెంగాల్ సిఎం మమతా ఇంట విషాదం

కోల్‌కతా (CLiC2NEWS): దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ మహమ్మారి వల్ల ఇప్పటికే అనేక మంది ప్రముఖులు మృతి చెందారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట్లో విషాదం అలుముకుంది. ఆమె సోదరుడు ఆషీమ్ బెనర్జీ కరోనా మహమ్మారి బారినపడి కన్నుమూశారు. ఆషీమ్ బెనర్జీ కోల్‌కతాలోని మెడికా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు. ఆషీమ్ బెనర్జీ కి కరోనా సోకడంతో కోలకతా లోని మెడికా ఆస్పత్రిలో చేర్చి వైద్యం అందించారు. ఇవాళ ఆయన పరిస్థితి విషమించడంతో ఆషీమ్ బెనర్జీ మృతి చెందారు. దీంతో సిఎం మమతా బెనర్జీ ఇంట విషాదం నెలకొంది. కరోనా నిబంధనల మధ్య మధ్యాహ్నం అంత్యక్రియలు నిమ్తలా మహా శ్మశాన్ ఘాట్‌లో జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆయన మృతికి పలువురు సంతాపం ప్రకటించారు.